Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: పల్లె పల్లెనా వైద్య శిబిరాలు

Garla: పల్లె పల్లెనా వైద్య శిబిరాలు

ఉచితంగా రక్త పరీక్షలు, మందుల పంపిణీ

ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ప్రబలుతున్న తరుణంలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పుల్లూరు పెద్ద సరిహద్దు తండా మర్రిగూడెం కొత్త పోచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రజలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, తగిన మందులను పంపిణీ చేశారు.

- Advertisement -

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని, 20 నిమిషాలు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల ఈ సీజన్లో వచ్చే టైఫాయిడ్ వాంతులు విరోచనాలు లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పద్మ పార్వతి జోష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News