వేసవికాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మండల ప్రత్యేక అధికారి మంగమ్మ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి కుమార స్వామి ప్రారంభించి, చల్లని మంచి నీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామ ప్రజల సౌకర్యార్థం ప్రయాణికుల కోసం నెహ్రూ సెంటర్ కూడలి సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, ప్రయాణికులు, బాటసారులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శానిటేషన్ ఇంచార్జ్ దాసు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.