Sunday, October 6, 2024
HomeతెలంగాణGarla: నూతన మండల అధ్యక్షుడుగా శేషగిరి గౌడ్ ఎన్నిక

Garla: నూతన మండల అధ్యక్షుడుగా శేషగిరి గౌడ్ ఎన్నిక

ట్రైనింగ్ ఇచ్చి, ఐడీ కార్డులివ్వాలి

గ్రామీణ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉంటూ ప్రధమ చికిత్స చేస్తున్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్‌ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర చారి కోరారు. మండలంలోని మర్రి గూడెం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ వేట వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గోళ్ల మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన సంఘం సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

గ్రామీణ వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. గ్రామీణ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారని అన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల అసోసియేషన్ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

అనంతరం గ్రామీణ వైద్యుల వెల్ఫేర్ అసోసియేషన్ మండల నూతన అధ్యక్షుడుగా సురభి శేషగిరి గౌడ్ ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన శేషగిరికి పలువురు గ్రామీణ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెస్ డెంట్ నజీర్ అహ్మద్ జిల్లా, మండల నాయకులు సిహెచ్ శ్రీను, కె.కోండల్ రావు, ఎండి జిలాని, జితేందర్ అగర్వాల్, రాజేందర్, మాదార్, ఉపేందర్, వీరభద్రం, కృష్ణ, శ్రీధర్, అశోక్, శ్రీను, మధుబాబు, అనిల్, బాపనయ్య ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News