ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గార్ల మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సూర్య తండలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఏర్పాటు చేసిన నిర్మాణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగేందుకు ఈనెల 6 నుంచి 19 వరకు కొనసాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో అధికారులు గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో ప్రవేశం కల్పించాలన్నారు అనంతరం నూతనంగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను యూనిఫాం, స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్టులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఎంపీపీ బట్టు నాగరాజు జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి తాసిల్దార్ రవీందర్ ఎంపీడీవో మంగమ్మ ఎంపీ ఓ రజిని డిటి సుధాకర్ ఎంఈఓ పూల్ చంద్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు పోట్ల నాగేశ్వరరావు శివ పాఠశాల సిబ్బంది జూకల్ కిషోర్ సహోపాధ్యాయులు సరిత ఏ ఈ శ్రీనివాస్ సిఆర్పి ఉపేందర్ తదితరులు ఉన్నారు.