జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని టి యూ డబ్ల్యూ జే ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతనూరి శ్రీనివాస్ కోరారు. గార్ల మండల ప్రథమ మహాసభను అట్టహసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రూపన్ శంకర్ అధ్యక్షత వహించగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టియూడబ్లూజే (ఐజేయూ) మండల ప్రధమ మహా సభకు జిల్లా అధ్యక్షుడు చింతనూరి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి మీడియా రంగం ప్రాణవాయువు లాంటిదన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రభుత్వాలు, సహకరించాలని కోరారు.
రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంఘం ఐజేయూ అని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు నూతన ప్రభుత్వం ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు వారి సమస్యలు పరిష్కారానికి మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయంలో వంచనకు గురైన జర్నలిస్టు లకు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల బీమా సౌకర్యం, ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించాలని రాష్ట్ర సియం రేవంత్ రెడ్డి, మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి లను కోరినట్లు తెలిపారు. జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని పునరుద్ఘటించారు. ముందుగా పత్రిక రంగానికి విశేషంగా కృషి చేసి ప్రాణాలు ఆర్పించిన షోయబుల్లా ఖాన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహాసభకు హజరైన అతిథులకు శాలువలు కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో ఎస్సై జీనత్ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుండా వెంకటరెడ్డి లు పాల్గొని సౌహర్ద సందేశాలు అందించారు.జిల్లా కార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంధసిరి రవి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బుడాన్,సహయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, కౌన్సిల్ సభ్యులు తోడేటి రాము, వెంకటరమణ,ఆవుల యుగేందర్,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కోశాధికారి గండి సీతారాం, మండలంలోని వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.