Friday, October 18, 2024
HomeతెలంగాణGarla: రెండవ రోజుకు ఐద్వా నిరాహార దీక్షలు

Garla: రెండవ రోజుకు ఐద్వా నిరాహార దీక్షలు

హాస్పిటల్ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించాలని రాస్తారోకో

గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న ఉన్నత అధికారులు స్పందించడం లేదని, జిల్లా కలెక్టర్ అదైత్వ కుమార్ సింగ్ అయిన స్పందించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.

- Advertisement -

ముప్పై పడకల ఆసుపత్రిలో పూర్తి స్దాయిలో వైద్యులను నియమించాలని కోరుతూ ఐద్వా అధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ఇప్పటికే ప్రబలుతున్నాయనిహ హాస్పిటల్ ఉన్న కొంత మంది వైద్యులు, సిబ్బంది బదిలీ లపై వెళ్తున్నారని ప్రజలకు వైద్యం అందించే నాధుడే కరువైయ్యారని అన్నారు. వర్షాకాలంలో జ్వరాలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం ఒక్కొక్క ఇంటికి సుమారుగా 5-10 వేల రూపాయలు వైద్య ఖర్చులు అవుతాయని ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేశారు.

బదిలీల ప్రక్రియ ముగిసే వరకు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారి స్పందించి హాస్పిటల్ లో తక్షణమే వైద్య అధికారులతో పాటు, మహిళ వైద్యురాలిను నియమించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల నుండి అందోళన చేస్తున్న అధికారులు స్పందించక పోవడంతో స్దానిక నెహ్రూ సెంటర్ లో సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ అందోళనకు సిపియం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మల్లెల నాగమణి,మాజీ ఎంపిటీసి వి.పద్మ, నాయకులు సిహెచ్ సి.మౌనిక, తాళ్లపల్లి రమా,టి.నాగమణి, పద్మ,బి.ఝాన్సీ,బి.జ్యోతి,మరియమ్మ, వాణీ,అనూష,బి.లక్ష్మీ,యశోద తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News