వేసవి కాలం భానుడి భగభగలు రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మెరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో వైద్యశాఖ రెవిన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారులతో అత్యవసర సమన్వయ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నదున ఉదయం 11 నుండీ సాయంత్రము 4 వరకు ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్ళాల్సి వస్తే తెల్లని కాటన్ దుస్తులను ధరించి, తల మీద క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలన్నారు. నిత్యము మంచి నీళ్లను, పండ్ల రసాలు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి సేవించాలన్నారు.
వడదెబ్బకు గురైన వెంటనే చల్లని ప్రదేశాలకు తరలించి, తడి గుడ్డతో శరీరాన్ని తుడిచి, చల్లటి ఫ్యాన్ గాలికి ఉంచాలని, ఆరోగ్య పరిస్తితి విషమిస్తే వెంటనే అందుబాటులొ ఉండే పి హెచ్ సి లేదా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందాలన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వడ దెబ్బ వల్ల ఎవరూ ప్రాణాలను కోల్పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఏదైనా అత్యవసర వైద్య సహాయం కొరకు 108 /100 కి సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓ రవీందర్ , ఎస్ ఐ జీనత్ కుమార్, డి ఎం ర్ ఓ సుధాకర్ నాయక్, డా, అనిల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.