ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో గార్ల మండల పరిధిలో బుద్ధారం గ్రామానికి చెందిన పల్లె బోయిన ప్రణతి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. పల్లెబోయిన నాగరాజు అరుణ దంపతుల పుత్రిక ప్రణతి చిన్నతనం నుంచి చదువు మీద ఎంతో మక్కువ పెంచుకుంది. డోర్నకల్ బ్రిలియంట్ హై స్కూల్ లో పదవ తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించింది. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరంలో 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ప్రణతి నాన్న నాగరాజు వ్యవసాయం చేస్తూ తన పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. నాన్న కష్టానికి తగ్గ ఫలితం ఈ పాప తన చదువును కొనసాగిస్తూ ప్రతి పరీక్షలో కూడా సత్తా చాటుతూ వస్తుంది. ప్రణతికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.