తెలంగాణలోని అన్ని వర్గాల సమగ్ర అభ్యున్నతి, సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి అన్నారు. మహిళలకు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఉచిత బస్సును కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలతో పాటు జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి ఎక్కి ఆర్టీసీ సర్వీసును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు కాగానే రెండు గారెంటీలు అమలు చేసిందని సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం లోని మహిళలు సాధికారత సాధిస్తారని అన్నారు. మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజులలో దశల వారీగా అమలు జరుగుతాయని నాడు కాంగ్రెస్ అధిష్టానం ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని నేడు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు మాలోత్ అమ్మి అజ్మీరా కాంతి భానోత్ వనిత జ్యోతి మీనా సునీత సరిత కమళ బాలి సునీత చిన్ని పాల్గొన్నారు.