తపాలా శాఖ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ సబ్ డివిజన్ పర్యవేక్షణ అధికారి కాళీ మహేశ్వరి అన్నారు. తపాల శాఖ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో మండల ప్రజలకు తపాల సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రతి ఒక్కరు తపాలా శాఖలో అకౌంట్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. తపాలా శాఖ అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు సేవింగ్స్ అకౌంట్స్ రికరింగ్ అకౌంట్స్ పీపి ఎఫ్ అకౌంట్స్ పిపిఎఫ్ టీడి లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సేవలు సుకన్య సమృద్ధి యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సేవలను పోస్ట్ ఆఫీస్ అందిస్తుందన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను కూడా ప్రారంభించామని తెలిపారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా ప్రతినెల గ్రామాలలో అందరికీ పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.
యాక్సిడెంటల్ బీమా పాలసీల ద్వారా అతి తక్కువ మొత్తంలో సేవలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ బి నాగరాజు ఎంవోజి మల్లికార్జున్ రావు తపాల శాఖ ఎస్ ఓ సిబ్బంది మండల ప్రజలు పాల్గొన్నారు.