గార్ల మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా నిమ్మ తోట జీనత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించే భానోత్ వెంకన్న మహబూబాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. మరిపెడ ఎస్సైగా ఉన్న జీనత్ కుమార్ ను గార్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైకి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.