Sunday, September 8, 2024
HomeతెలంగాణGarla: లక్ష్మీనరసింహ స్వామి గుడికి సౌండ్ బాక్స్ లు బహుకరణ

Garla: లక్ష్మీనరసింహ స్వామి గుడికి సౌండ్ బాక్స్ లు బహుకరణ

గార్ల మండలం పుల్లూరు గ్రామ శివారులోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి 16 వేల రూపాయల విలువ చేసే రెండు స్పీకర్ బాక్స్ లను కీసర సంధ్య యుగంధర్ రెడ్డి కుమార్తె కొనియాల అక్షిత మనోజ్ రెడ్డిల సహకారంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆలయానికి బహుకరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆలయ పురోహితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని భవిష్యత్తులో ఈ దేవాలయానికి వారి పూర్తి సహాయ సహకారాలు అందజేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News