Thursday, July 4, 2024
HomeతెలంగాణGarla: మిషన్ భగీరథ పైపు లైన్ క్రింద డబుల్ రోడ్డు వద్దు

Garla: మిషన్ భగీరథ పైపు లైన్ క్రింద డబుల్ రోడ్డు వద్దు

సిపిఎం అధ్వర్యంలో ఎంపిపి, ఎంపిడివోలకు వినతి

గార్ల నుండి చిన్న బంజార తండా వరకు సుమారుగా 14 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మిషన్ భగీరథ పైపు లైన్ పై డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్ట వద్ద ని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ అన్నారు. మిషన్ భగీరథ పైపు లైన్ పై నూతనంగా బిటి రోడ్డు నిర్మాణం చేపట్ట వద్దని సిపిఎం అధ్వర్యంలో స్థానిక ఎంపిడివో కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని కానీ సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన గత వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి పోవడంతో త్రాగునీటి నీరు వృథాగా పోయిందని అన్నారు. గతంలో ముందస్తు అంచనా లేకుండా సింగిల్ బిటి రోడ్డుకు పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైపు లైన్ నిర్మాణం చేయడం వలన డబుల్ రోడ్డు నిర్మాణ పనులలో పైపు లైన్ పగిలిందని అన్నారు. ఇప్పుడు కూడా రోడ్డు కాంటాక్ట్రర్ నిర్లక్ష్యం మూలంగా మిషన్ భగీరథ పైపు లైన్ మీద రోడ్డు నిర్మాణం చేపడితే భవిష్యత్తులో పైపు లైన్ మరమ్మత్తులకు గురైనప్పుడు రోడ్డు పగలగొట్టి మరమ్మత్తులు చేసే అవకాశం ఉందని దాని వలన ప్రజా ధనం వృథా అవుతుందని, సమయం ఎక్కువగా తీసుకోవడం వలన సమీప ప్రాంతాల ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేశారు.

గతంలో రోడ్డు క్రింద నిర్మాణం చేసిన మిషన్ భగీరథ పైపు లైన్ ను తొలగించి రోడ్డు పక్క నుండి నూతన పైపు లైన్ నిర్మాణం చేపట్టి గిరిజన ప్రాంతాలకు త్రాగునీటి ని అందించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా మండల అధికారులు తక్షణమే స్పందించి పైపు లైన్ నిర్మాణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణం లో మిషన్ భగీరథ పైపు లైన్ ను రోడ్డు ప్రక్క నుండి నిర్మించాలని డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్నిఎంపిపి బట్టు నాగరాజు, ఎంపిడివో మంగమ్మ లకు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కమిటి సభ్యులు భూక్య హరి నాయక్, వి.పి.వెంకటేశ్వర్లు, ఐ.గోవింద్, యం.నాగమణి, బి.లోకేశ్వరావు, బి‌‌.ఉపేందర్ రెడ్డి, కె.రామకృష్ణ, వి.కొండయ్య, జి‌.వీరభద్రం, జి.అశోక్, లచ్చయ్య, కోటయ్య, ఇస్తారి, సర్వర్, సర్వయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News