Thursday, April 17, 2025
HomeతెలంగాణGarla: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Garla: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గత స్మృతుల్లో..

వారంతా ఓకే చోట చదువుకున్నారు పదో తరగతి పూర్తయ్యాక ఉద్యోగాల్లో స్థిరపడగా మరి కొంతమంది ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. గార్ల మండలంలోని సమత హై స్కూల్ లో 2006-2007 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయంగా స్కూల్లో చదువుకున్నప్పటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు సరోజినీ నరసింహారావు రంగారావు నరేందర్ ఉమాకర్ సునీత అలివేలు లక్ష్మీ మల్లేశ్వరరావు పాషాలను శాలువాతో ఘనంగా సన్మానించి, మెమొంటోలను అందజేశారు. పూర్వ విద్యార్థులంతా ఒకేచోట చేరడంతో పాఠశాల ఆవరణం మొత్తం సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సరోజినీ నరసింహారావులు మాట్లాడుతూ..పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రున్వాల్ వీరన్న ఇందిరా భావన శాంతా రాజేష్ రవీందర్ శోభన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News