పద్మశాలి సంఘం రాష్ట్ర కమిటి నూతన కార్యవర్గంలో గార్ల మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు, జిల్లా ప్రధానకార్యదర్శి అలవాల రామకృష్ణకు చోటుదక్కింది. ఈనెల 17న హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో రాష్ట్రపద్మశాలీ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా పద్మశాలీ రాష్ట్ర కమిటి నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం రాష్ట్ర అద్యక్షులుగా ఎన్నికైన వల్లకాటి రాజకుమార్ రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గా అలవాల రామకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి ఎంపికైన రామకృష్ణ మాట్లాడుతూ నూతన రాష్ట్ర కార్యవర్గంలోకి జిల్లా పద్మశాలీలకు చోటుకల్పించడంతో పాటు మండలాల నుండి పలువురిని తీసుకోవడం హర్షించదగ్గ విషయమని, రాష్ట్ర కమిటిలోకి మండల స్థాయి నుండి రాష్ట్ర కార్యవర్గంలో అసోసియేట్ ప్రెసిడెంట్ గా తనపై నమ్మకం ఉంచినందుకు సంఘం అభివృద్ధి కోసం మరింత బాధ్యతను పెంచినందుకు రాష్ట్ర కమిటి కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి రాష్ట్ర కమిటిలోకి తీసుకోవడం కృతాభివందనాలు తెలియజేశారు. పద్మశాలీ ఐక్యతను, ప్రభుత్వం నుండి సంఘం పద్మశాలీలకు రావాల్సిన పథకాల అమలు కోసం జిల్లా అధ్యక్షులు వేముల వెంకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటితో కలిసి తనవంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గంలో అసోసియేట్ ప్రెసిడెంట్ గా అలవాల రామకృష్ణ ఎన్నిక కావడం పట్ల మండల పద్మశాలి సంఘం నాయకులు మండల పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.