ఇటీవల కురుస్తున్న వర్షాలకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పాకాల ఏరు వంతెనపై నుండి ప్రవహించడంతో శనివారం సీపీఐ రాష్ట సమితి సభ్యుడు వైస్ ఎంపీపీ కట్టేబోయిన శ్రీనివాస్, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఏటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున రాంపురం, మధ్దివంఛ, పరిసర గ్రామాల ప్రజలు ఆప్ర మత్తం గా ఉండాలని సూచించారు. అనంతరం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు-నాలుగు నెలలు ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
- Advertisement -
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెన నిర్మాణం పేరుతో ఈ ప్రాంత ప్రజలను పదేళ్లపాటు దగా చేసిందని ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రజల కష్టాలు తీర్చేలా, హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని, అందుకు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు.