Tuesday, September 10, 2024
HomeతెలంగాణGarla: నిరుపేద కుటుంబానికి అండగా పోలీసులు

Garla: నిరుపేద కుటుంబానికి అండగా పోలీసులు

ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పోలీసులు మంచి మనసును చాటుకున్నారు. గార్ల మండల కేంద్రంలో స్థానిక ఇందిరానగర్ కాలనీకి చెందిన బైక్ మెకానిక్ వల్లపు దాసు యుగేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉన్నవారి స్థితిగతులు తెలుసుకున్న గార్ల బయ్యారం సీఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ లు పోలీసు వృత్తి విధులను నిర్వర్తిస్తూనే సమాజ సేవే లక్ష్యంగా తమ వంతుగా మృతుని భార్య ధనలక్ష్మికి పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా 50 కేజీల బియ్యం నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News