Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే కోరం

Garla: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే కోరం

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రవీందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 16 మంది లబ్ధిదారులకు (1601856) రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గతంలో చెక్కుల కోసం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ముందు పడిగాపులు కాసేవారని, ఇప్పుడు ఆ అవసరం లేదని, లబ్ధిదారులకు మండల కేంద్రంలోనే పంపిణీ చేస్తామని తెలిపారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేయడమే కాకుండా పేద ప్రజలకు అన్ని పథకాలు చేరువయ్యేలా కృషి చేస్తామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి ఎంపీపీ బట్టు నాగరాజు ఎంపీడీవో మంగమ్మ డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ గుండా వెంకట్ రెడ్డి భూక్య నాగేశ్వరరావు ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News