Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: పోషక ఆహార లోపమే అసలైన అనారోగ్యం

Garla: పోషక ఆహార లోపమే అసలైన అనారోగ్యం

పోషణ పక్వాడ్ లో భాగంగా..

పోషక ఆహార లోపమే అసలైన అనారోగ్యమని పోషక ఆహారంతోనే ఆరోగ్య భద్రత లభిస్తుందని సూపర్వైజర్ గోపమ్మ పేర్కొన్నారు ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషణ పక్షం వారోత్సవాల్లో భాగంగా గార్ల మండల పరిధిలోని పుల్లూరు సర్కిల్ అంగన్వాడి మూడు నాలుగు సెంటర్లలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పోషక ఆహారాలు తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ గోపమ్మ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు బాలికలు చిన్నారులు పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంగన్వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూ, మేధోశక్తిని పెంచేందుకు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలందరిని అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించిన చిన్నారులకు ప్రీస్కూల్ బుక్స్ ప్రొఫైల్స్ అభివృద్ధి చార్ట్ పిల్లల పర్యవేక్షణ కార్డు ఉచితంగా అందజేస్తామన్నారు. తద్వారా చిన్నారులకు మానసికంగా ఆర్థికంగా సాంఘిక స్థాయిని పెంచడానికి దోదపడుతుందన్నారు.

- Advertisement -

శిశువు పుట్టగానే ముర్రుపాలు పట్టిస్తే పోషకాలు అందుతాయని ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని ఆరు నెలలు దాటిన వెంటనే తల్లిపాలతో పాటు అంగన్వాడీలో అందించే బాలామృతం గుడ్లు పెట్టాలని దీంతో చిన్నారులకు పోషకాలు అంది శారీరకంగా ఎదుగుదల చదువులో రాణించడానికి దోహదపడుతుందన్నారు. పోషణ పక్వాడ్ లో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీలో అందిస్తున్న పోషక ఆహారాలను వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీలకు బాలింతలకు పోషణ విలువలు చిరుధాన్యాలపై అదనపు ఆహార విశిష్టత తల్లిపాల అవశ్యకత రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పి ఎస్ హెచ్ పద్మ వీరమ్మ పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ అంగన్వాడి టీచర్లు ఉపేంద్రమ్మ సునీత పార్వతి ఆశ ఉమా గర్భిణీ స్త్రీలు బాలింతలు తల్లులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News