Friday, November 22, 2024
HomeతెలంగాణGarla: భావితరాలకు స్పూర్తి సుందరయ్య

Garla: భావితరాలకు స్పూర్తి సుందరయ్య

పార్టీ కోసం పిల్లలను కూడా కనని లీడర్!

జీవితమంతా ప్రజా సేవకై అంకితం చేసిన త్యాగ ధనుడు, ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య భావితరాలకు స్పూర్తిగా నిలిచారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు.

- Advertisement -

స్వాతంత్ర సమర యోధులు, ఆదర్శ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సిపిఎం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సుందరయ్య స్తూపం వద్ద సుందరయ్య చిత్ర పటానికి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ జెండా ను భాస్కర్ ఎగురవేశారు. అనంతరం భూక్య హరి నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో భాస్కర్ మాట్లాడుతూ చిన్నతనం నుండే పోరాట తత్వాన్ని అలవరచుకున్న సుందరయ్య అట్టడుగున అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, పేదలకు నిత్యావసర వస్తువులు అందించటం, వైద్యం అందించడం కోసం కృషి చేశారని చెప్పారు. ఎంపిగా ఉన్న సుందరయ్య పార్లమెంట్ కు సైతం సైకిల్ మీద వెళ్లి నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని, పార్టీ కోసం బిడ్డలను కూడా కనని సుందరయ్య నిజమైన కమ్యూనిస్టు ఎలా ఉండాలో ఆచరణలో చూపిన మహా నాయకులు అని సుందరయ్య సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.వెంకటేశ్వర్లు, ఐ.గోవింద్,ఎ.వీరాస్వామి, కె.సత్యవతి, యం.నాగమణి, సిహెచ్ ఎల్లయ్య, బి‌.లోకేశ్వరావు, జె.సత్యం, మోహన్, వశ్యా, టి.రమా,ఎ.రామకృష్ణ, వి.కొండయ్య, బాజీ, కె.రామకృష్ణ, జి.అశోక్, సింగం వెంకటేశ్వర్లు, ఎస్ నాగరాజు, జి.వీరభద్రం, లక్ష్మయ్య, టి.నవీన్, టి.నాగేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News