Friday, November 22, 2024
HomeతెలంగాణGarla: టెన్త్ లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పూనెం పూజిత

Garla: టెన్త్ లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పూనెం పూజిత

జిపిఏ గ్రేడ్ 8.8. పాయింట్

10 వ తరగతి ఫలితాల్లో మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పూనెం పూజిత 8.8 జీపీఏ పాయింట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మండల టాపర్ గా నిలిచింది. గార్లలోని ప్రైవేటు పాఠశాలల్లో నిర్మలా హైస్కూల్ కు చెందిన కాలా తమన్నజైన్ 9.8 జీపీఏ పాయింట్లు సాధించి మండల టాపర్ గా నిలువగా, విశ్వశాంతి హైస్కూల్ కు చెందిన యు హర్షిత 9.7: నిర్మలా హైస్కూల్ కు చెందిన బి వినీల 9.7 జీపీఏ పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు.

- Advertisement -

కాగా గార్ల మండలంలోని మద్దివంచ, పుల్లూరు, పెద్దకిష్టాపురం, కొత్తపోచారం హైస్కూళ్లలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ బి పూల్ చంద్ తెలిపారు. మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈఏడాది 10 ఫలితాల్లో ఓవరాల్ గా కేవలం 95% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విశ్వశాంతి హైస్కూల్.. నిర్మలా హై స్కూల్ 100% ఫలితాలు సాధించిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News