Thursday, April 10, 2025
HomeతెలంగాణGarla: రామ మందిర ప్రారంభోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

Garla: రామ మందిర ప్రారంభోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

అక్షింతలు, శ్రీరాముడి చిత్రపటంతో శోభా యాత్ర

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంతో భారతీయ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని కాలా విశాల్ జైన్ మనోజ్ అగర్వాల్ లు పేర్కొన్నారు. అయోధ్యలో జనవరి 22 న రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి శ్రీరాముని చిత్రపటంతో కూడిన కరపత్రాలను గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమల్ అగర్వాల్ మెడికల్ షాప్ లో ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి మందిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించామన్నారు.

- Advertisement -

జనవరి 3 వ తారీకు ఉదయం 8 గంటలకు గార్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవస్థానం నుండి అక్షింతలు, శ్రీరాముడి చిత్రపటంతో మేళతాళాల నడుమ పట్టణ పురవీధుల గుండా శోభా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కట్ట రమేష్ సతీష్ కుమార్ శ్రీనివాస్ గుప్తా సత్యం కమల్ అగర్వాల్ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News