ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆదివారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో గార్ల పట్టణ వర్తకులు గణేష్ యువసేన సభ్యులు ముందస్తు సన్నాక సమావేశం నిర్వహించారు. వర్తక సంఘం భవనంలో గతంలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించిన మాదిరిగా ఈ సంవత్సరం అత్యంత వైభవ్వేతంగా భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీరామనవమి వేడుకలను గార్ల పట్టణ వర్తక సంఘం కమిటీ గణేష్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వర్తక సంఘం సభ్యులు గణేష్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.