మండల కేంద్రంలోని డోర్నకల్ వెళ్ళే మార్గంలో ఉన్న శ్రీరామ వైన్స్ షాపు లో చోరి జరిగిన ఘటన రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జీనత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రోజు లాగానే షాపు ముగించుకుని ఇంటికి వెళ్ళిన షాపు నిర్వహకులు శనివారం షాపు కు రాగానే షాపులో చూడగా షాపు వెనుక భాగంలో ఉన్న డోర్ ను రాడ్ తో తొలగించి షాపులో ఉన్న సుమారుగా 3 వేల రూపాయలు నగదు, లెనోవా ల్యాప్ ట్యాప్, సిసి పుటేజి డివిఆర్ లు చోరికి గురైనట్లు తెలిపారు.
చోరి జరిగిన షాపును క్షణ్ణంగా పరిశీలించిన ఎస్సై జీనత్ కుమార్ జిల్లా కు చెందిన క్లూస్ టీం ను పిలిపించి ఆధారాలను సేకరించారు. షాపు సమీపంలో డివిఆర్ ను గుర్తించి సిసి పుటేజిని పరిశీలించగా చోరి చేసిన వ్యక్తి చింత అశోక్ అని గుర్తించినట్లు తెలిపారు. దొంగలించిన వస్తువుల విలువ సుమారుగా 24,500 రూపాయలుగా ఉంటుందని అర్వపల్లి శివ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీనత్ కుమార్ తెలిపారు.