విద్యార్థులు భావిభారత నిర్మాతలని సమాజానికి ఆదర్శవంతంగా ఎదగాలని గార్ల సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు వెల్కమ్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఐవి రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్ లకు పాల్పడకూడదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎందరికో ఉన్నత విద్యను సంస్కారాన్ని అందించిన కళాశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ప్రణాళిక బద్ధంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పలు సినిమా పాటలకు గేయాలకు విద్యార్థిని విద్యార్థులు చేసిన డ్యాన్సులు పలువురిని అలరించాయి.
ఈ కార్యక్రమంలో నేషనల్ మెడికల్ షాప్ అధినేత హతిరాం రిటైర్డ్ టీచర్స్ ఎడ్ల అప్పయ్య వజ్రం నాగేశ్వరరావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్ రావు వేముల రవీందర్ గొడుగు సోమన్న జోగ్యా నాయక్ నాగేశ్వరరావు డాక్టర్ యు శ్రీనివాస్ రాంబాబు సుజాత స్రవంతి సంధ్య లైబ్రేరియన్ లక్మాలాల్ నాన్ టీచింగ్ స్టాఫ్ యు డి సి విమల అంబేద్కర్ రాజశేఖర్ సత్యనారాయణ ముత్తయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.