గార్ల మండల పరిధిలోని పలు గ్రామాలలో పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ సిబ్బంది విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి లైట్లు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు ఆయా గ్రామాల్లో వెల్లువెత్తుతున్నాయి.
బాలాజీ తండా గ్రామంలో వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేకనే ఇలా గ్రామాలలో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతూ వందలాది యూనిట్ల విద్యుత్తు వృధా అవుతుందని పంచాయతీ ఆదాయం జనాభా మేరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రిపూట ఆన్ చేసి మరల ఉదయం పూట ఆఫ్ చేయాలి కానీ మిగతా గ్రామాలతో పోలిస్తే కొన్ని గ్రామాలలో ఇలా జరగకపోవడంతో వీది దీపాల నిర్వహణ సమస్యలను గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలలో వీధిలైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్ లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.