Sunday, July 7, 2024
HomeతెలంగాణGarla: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

Garla: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

గడువు దాటిన విత్తనాలు నిల్వ ఉన్నా..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు హెచ్చరించారు. గార్ల మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలలో బుధవారం ఎస్ఐ జీనత్ కుమార్ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు దుకాణాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

తప్పనిసరిగా బిల్‌ బుక్కులు మెయింటైన్‌ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క విత్తన డీలర్లు నిబంధనలు పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు విత్తన బిల్లులు ఇవ్వాలని ప్రతిరోజు విత్తన కంపెనీ పేరు తదితర వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.

గడువు దాటిన విత్తనాలు రైతులకు అమ్మినా, షాపు యందు నిల్వ ఉంచిన సంబంధిత షాప్ పై విత్తన యాక్ట్ ప్రకారం లైసెన్సు రద్దుకు సిఫార్సులు చేస్తామని హెచ్చరించారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయడమే కాకుండా పంట సమయం ముగిసే వరకు భద్రపరుచుకోవాలని, గ్రామాలలోకి వచ్చే అపరిచిత వ్యక్తుల వద్ద లూజు విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News