Saturday, November 2, 2024
HomeతెలంగాణGarla: సబ్ స్టేషన్ స్వాధీనం, పునః ప్రారంభానికి ఏర్పాట్లు

Garla: సబ్ స్టేషన్ స్వాధీనం, పునః ప్రారంభానికి ఏర్పాట్లు

ఎమ్మెల్యే కనకయ్య చొరవతో ..

గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం సబ్ స్టేషన్ ఎట్టకేలకు స్వాధీనం చేసుకొని మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని మండల విద్యుత్ శాఖ ఎ ఈ మహేంద్రబాబు తెలిపారు.

- Advertisement -

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవతో సీఎండి ఆదేశాల మేరకు సత్యనారాయణపురం సబ్ స్టేషన్ ను స్వాధీనపర్చుకున్నామని, పునః ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సబ్ స్టేషన్ 2021లో 2కోట్ల వ్యయంతో నిర్మించగా స్థల దాత బాల్ సింగ్ అండగీంచడం మూలంగా మూడు సంవత్సరాల పాటు వినియోగంలోకి రాలేదన్నారు. స్థల యాజమాని బాల్ సింగ్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యేతో కలిసి మేము చర్చించి ఈరోజు స్వాధీనం చేసుకొని మరమ్మతు పనులు చేపట్టామన్నారు. మరో వారం రోజుల్లో విద్యుత్ సేవలందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీ ఈ కిషన్, ఎస్ ఈ నరేష్,డీ ఈ విజయ్, ఏడీ రమేష్ విద్యుత్ సబ్బంది పాల్గొనట్లు ఎఈ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News