కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మొదటి తరం మహిళ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపిటిసి అలవాల సుభద్రమ్మ ఆశయ సాధన కొరకు కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ అన్నారు.
సిపిఎం సినియర్ నాయకురాలు అలవాల సుభద్రమ్మ 5వ వర్ధంతి ని సిపిఎం అధ్వర్యంలో స్థానిక మంగపతిరావు భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభద్రమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిహెచ్. ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ సుభద్రమ్మ మండల సిపిఎం పార్టీకి, మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈ రెండు సంఘాలకు నాయకత్వం వహిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లోకి చొచ్చుకొని వెళ్ళి గ్రామ, గ్రామాన కాలినడకన వెళ్లి కమిటీలు వేసి పార్టీ ని,సంఘాలను బలోపేతం చేశారని చెప్పారు.
గార్ల-1 ఎంపిటిసిగా ఎన్నికై ప్రజల కోసం అనేక సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేశారని, సినియర్ నాయకులు మంగపతిరావు, సత్తార్ మియా, యం.రాఘవులు, టి. నరసింహారావు, వేజేళ్ళ సైదులు రావు,ఎ. లక్ష్మీనారాయణ,యం అనంతయ్య, పి. వీరభద్రం, టి. గురవయ్య, చిలక సత్యం లాంటి అమరులతో కలిసి పని చేశారని చెప్పారు. స్వయంగా తన కుటుంబం మొత్తాన్నీ పిఎన్ఎం, మహిళ సంఘం నాయకులుగా తీర్చిదిద్దారని, మోటూరు ఉదయం, కొండపల్లి దుర్గాదేవి, బత్తుల హైమావతి లాంటి రాష్ట్ర నాయకత్వాన్ని మండలానికి రప్పించి మహిళా సంఘం శిక్షణ తరగతులు నిర్వహించి ప్రజా సంఘాల అభివృద్ధి కోసం పాటు పాడారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా, మండల నాయకులు కందునూరి కవితా, భూక్య హరి, కె.ఈశ్వర్ లింగం, ఐ.గోవింద్, యం.నాగమణి, ఎ.రామకృష్ఞ, భాగం లోకేశ్వరావు, కె.రామకృష్ణ,కై బాబు, మల్లయ్య, సర్వర్, టి.నాగేశ్వరావు, జి.వీరభధ్రం, కుటుంబ సభ్యులు అలవాల రామకృష్ణ, ఎస్.నాగరాజు తదితరులు ఉన్నారు.