Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Garla: ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా పరిషత్, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను, అంగన్వాడి సెంటర్, గార్ల రాంపురం చెక్ డాం, ములకనూరు పి.హెచ్.సి ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అందుతున్న సేవలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, మండల వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేసి విష జ్వరాలు ప్రబలకుండా, సానిటేషన్, వైద్యుల సూచనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

జిల్లా పరిషత్, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేసి పాఠశాల తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలని, విద్యార్దులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని పాఠశాలలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్రాగునీరు, విద్యుత్తును ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

విద్యార్దుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం మెనూ ప్రకారం అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అనంతరం గార్ల, రాంపురం చెక్ డాంను సందర్శించి పరిశీలించారు. రాంపురం చెక్ డాం హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ తనిఖీ లో తహసీల్దార్ రవీందర్, ఎంపిఓ, సంబందిత అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News