Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla-Teluguprabha effect: 'తెలుగుప్రభ' కథనానికి స్పందన, చెత్తను ఎత్తేసిన కార్మికులు

Garla-Teluguprabha effect: ‘తెలుగుప్రభ’ కథనానికి స్పందన, చెత్తను ఎత్తేసిన కార్మికులు

ఎట్టకేలకు కదిలిన స్థానిక యంత్రాంగం

గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ లో శుక్రవారం పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ నుండి తీసిన చెత్తను తొలగించారు. గురువారం తెలుగు ప్రభ దినపత్రిక జిల్లా ఎడిషన్ లో చెత్తను తీశారు ఎత్తడం మరిచారు అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి గార్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ స్పందించి తక్షణమే చెత్తను తొలగించాలంటూ పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించడంతో రంగంలోకి దిగిన వారు శుక్రవారం రహదారిపై ఇరువైపులా నిలువ ఉన్న చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.

- Advertisement -

తెలుగు ప్రభ దిన పత్రికలో చెత్తను ఎత్తడం మరిచారు కథనం ప్రచురితం కావడంతో రహదారిపై రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న చెత్త నిలువలు శుభ్రం దిశగా తోడ్పాటు అందించిన పత్రికా యాజమాన్యానికి రిపోర్టర్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఏ కిరణ్ ఏ శ్రీనివాసరావు పి.సుధాకర్ ఎస్ ప్రేమ్ కుమార్ కే ప్రేమ్ చంద్ వి. ప్రభాకర్ రాజు అరవింద్ సతీష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News