Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: జర్నలిస్టుల సమస్యలపై పరిష్కార మార్గం చూపాలి

Garla: జర్నలిస్టుల సమస్యలపై పరిష్కార మార్గం చూపాలి

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై అహర్నిశలు పోరాటం చేస్తూ వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం దిశగా పోరాడే వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టియూడబ్ల్యూజె ఐజేయు మండల కన్వీనర్ రూపన్ శంకర్ కో కన్వీనర్ నేలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం గార్ల మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండలంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కల్పించి, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని, వారి పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్య అందించాలని
వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు అక్రిడేషన్ తో సంబంధం లేకుండా కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ,వయస్సు పైబడిన జర్న లిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని,
నిలిచిపోయిన రైల్వే రాయితీలు పునఃప్రారంభించి రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలని న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ రవీందర్ కు అందజేశారు.

- Advertisement -

అనంతరం ఈ సందర్భంగా టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్ జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడేటి రాము గౌడ్ లు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా విద్య వైద్యం ప్రయాణం సౌకర్యాలు కల్పించాలని గత పాలక ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను గుర్తించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చొరవ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దువ్వా సతీష్ కుమార్ మాదా శ్రీకాంత్ తాళ్లూరి కొండలరావు ఎడ్ల రాజశేఖర్ పిడుగు సురేందర్ వల్లపు దాసు వెంకటేశ్వర్లు వజ్రం నాగేశ్వరరావు ఈశ్వర్ లింగం తేజావత్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News