Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: వివోఏల నిరవధిక సమ్మె@8వ రోజు

Garla: వివోఏల నిరవధిక సమ్మె@8వ రోజు

రాష్ట్ర ప్రభుత్వం వివోఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని బి.ఎస్.పి పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాదావత్ ప్రతాప్ నాయక్ డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త‌ పిలుపు లో భాగంగా తెలంగాణ ఐకేపి ఉద్యోగుల సంఘం (సిఐటియు) అధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలు చేస్తున్న వివో ఏ లకు బిఎస్ పి పార్టీ తరఫున మద్దతు పలికారు. వివోఏల చేత వెట్టి చాకిరీ పనులు చేయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి పనికి తగిన వేతనం చెల్లించడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న ప్రభుత్వం వారి సమస్యలను పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

గత కొంత కాలంగా అధిక సంఖ్యలో మహిళలైన వివోఏలు అనేక రకాలుగా నిరసనలు చేపట్టిన స్పందించక పోవడంతో సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం స్పందించి వివోఏల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పెద్ద దింపే సామర్థ్యం వారికి గ్రామాల్లో ఉంటాయన్నారు. వారిని తక్కువ అంచనా వేయద్దని హెచ్చరించారు. వారి పక్షాన బీఎస్పీ పోరాడుతుందన్నారు.

ఈ సమ్మెలో జిల్లా కార్యదర్శి లేతాకుల కాంతారావు, గార్ల మండలం అధ్యక్షులు అజ్మీరా వెంకన్న, మండల నాయకులు జీవన్, దళపతి వివో ఎల గార్ల మండల కమిటీ అధ్యక్షులు ఉమా, ఉపాధ్యక్షులు వీరలక్ష్మి, కార్యదర్శి వినోద, కోశాధికారి అనిత, సహాయ కార్యదర్శి మనోహర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభారాణి మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News