పోరాటంతోనే ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది జంపాల విశ్వ వివోఏ లకు పిలుపునిచ్చారు. గార్ల మండల కేంద్రంలో వివోఏలు సిఐటియు ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో విశ్వ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక, ఉద్యోగ భద్రత లేక వివోఏలు అనేక సమస్యలతో తమ జీవితాలను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కనీస గుర్తింపు కార్డులను సైతం ప్రభుత్వం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వివోఏలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలను పరిష్కరించకపోతే వివోఏలు స్వయం సహాయక మహిళా సంఘాలతో కలుపుకొని తమ పోరాటాన్ని ఉదృతం చేసి రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి కందుల శోభారాణి, ఐద్వా సంఘం రాష్ట్ర నాయకురాలు సత్యవతి, ఉమా, సీఐటీయూ మండల కార్యదర్శి కే శ్రీనివాస్, వివోఏల గార్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు, బోళ్ళ ఉమా, మోడెం వినోద, అనిత, కల్పన, సరిత, శ్రీజ, సునీత, లక్ష్మి, సరోజ, రజిని, స్వప్న, శారద, జ్యోతి, వీరలక్ష్మి, మనోహర్, మాంగ్యా, రమేషు, వెంకటేష్ , సైదులు, రామ, అరుణ, గార్ల మండలంలో మండల స్థాయి సెర్ప్ సిబ్బంది ఏపిఎం సత్యనారాయణ, సీసీలకు పతి, కోటేశ్వరి, భాగ్యమ్మ, ధనలక్ష్మి, ఎమ్మెస్ కంప్యూటర్ ఆపరేటర్ రవి, ఎమ్మెస్ అకౌంటెంట్ శారద తదితరులు పాల్గొన్నారు.