మలేరియా నివారణకు పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ ఎంపీపీ శివాజీ చౌహన్ అన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అవినాష్ ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవం సందర్భంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం నుండి గార్ల పట్టణ పురవీధుల గుండా దోమతెరలు వాడండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ దోమతెరలు వాడడం ద్వారా మలేరియా రాకుండా నివారించవచ్చునని, అలాగే పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని ప్రజలకు తెలియజేశారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలకు, ఆశావర్కర్లకు, అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల నివారణకు సహకరిస్తే మలేరియాను పూర్తిగా నివారించవచ్చని వివరించారు.
ఈ ర్యాలీ అవగాహన సదస్సులో ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ డాక్టర్ రాజకుమార్ సూపర్వైజర్లు శ్రీహరి ఇస్మాయిల్ బేగ్ రాధాకృష్ణ బుజ్జమ్మ ఎంఐ ఎల్ హెచ్ పి ఎస్ ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు