Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: జెడ్పీటీసీతో సహా 30 మంది బీఆర్ఎస్ కి రాజీనామా

Garla: జెడ్పీటీసీతో సహా 30 మంది బీఆర్ఎస్ కి రాజీనామా

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు జాటోత్ ఝాన్సీలక్ష్మి ప్రకటించారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక పొంగులేటి కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని ఆశచూపి పార్టీలో చేర్చుకొని 4 ఏళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్ పొంగులేటికి సముచిత స్థానం కల్పించపోగా, ఆయనకు
ప్రభుత్వం భద్రతను సైతం కుదించడం చూస్తుంటే, రాష్ట్రంలో సీఎం కెసీఆర్ పాలన నియంత దొరల పాలనగా తలపిస్తోందన్నారు. అదే విధంగా ఆయన వెంట తిరుగుతన్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు సైతం ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న, “రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది మంది ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి, పొంగులేటి వర్గంలో చేరడం ఖాయమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో 10 కి 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం.
ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో మాజీ రైతుబంధు కన్వీనర్ గుండా వెంకట్ రెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్ ఆడెపు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లు అజ్మీరా శంకర్, బాదావత్ సరోజ, గార్ల, పుల్లూరు వారు సభ్యులు తాళ్లూరి విజయకుమారి, బానోత్ సురేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మీరాపఠాన్, ఎస్ఎంసీ చైర్మన్ లు కోల కుమార్ గౌడ్, గూగులోత్ శ్రీను, గూగులోత్ చాంద్మాల్ బాదావత్ రవి, భూక్యా సోనా, బీ మంగీలాల్, గోపి వెంకటేశ్వర్లు, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, రామిరెడ్డి, బానోత్ మల్పూర్, బి సురేష్, డి. రవి లతో పాటు మరో 20 మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News