Sunday, July 7, 2024
HomeతెలంగాణMLA GMR Charity: సమాజ సేవలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదర్శం

MLA GMR Charity: సమాజ సేవలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదర్శం

4 లక్షల రూపాయల సొంత నిధులతో పోలీసులకి రెయిన్ కోట్లు

సమాజ సేవలో పోలీసు శాఖ పాత్రను గుర్తించి, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు 4 లక్షల రూపాయల సొంత నిధులతో రేయిన్ కోట్లను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ రమణ కుమార్ అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న 425 మంది పోలీసులకు జిల్లా ఎస్పీ రమణ కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిదుల చేతుల మీదుగా రేయిన్ కోట్లను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు పుత్ర శోకం కలగడం అత్యంత బాధాకరమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసు శాఖ కోసం సొంత నిధుల రేయిన్ కోట్లు పంపిణీ చేయడం ఎమ్మెల్యే నిబద్ధతను చాటుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీసు శాఖలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల మూలంగా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు సైతం రాష్ట్రంలో నెలకొల్పపడుతున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలతోపాటు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సైతం సొంత నిధులచే సేవలు చేయడం ఎమ్మెల్యే జిఎంఆర్ కే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, డి.ఎస్.పి పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేష్ గౌడ్, పార్టీ డివిజన్ల అధ్యక్షులు ఆఫ్జల్, గోవింద్, రాజేష్, ప్రజా ప్రతినిధులు, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News