Sunday, July 7, 2024
HomeతెలంగాణGodavarikhani: నిబంధనలకు పాతరేస్తున్న శ్రీచైతన్య స్కూల్ పై చర్యల కోసం డిమాండ్

Godavarikhani: నిబంధనలకు పాతరేస్తున్న శ్రీచైతన్య స్కూల్ పై చర్యల కోసం డిమాండ్

స్పందించని మండల, జిల్లా విద్యా శాఖాధికారులు

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనల విరుద్ధంగా అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న ఆర్.ఎఫ్.సి.ఎల్ శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, బిజెపి నాయకులు కొండపర్తి సంజీవ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ లోనే పాఠ్యపుస్తకాలను, యూనిఫాంని తీసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని మండల, జిల్లా విద్యాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆ పాఠశాలపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా విద్యాధికారులు చేస్తున్నారని అన్నారు.

వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి విద్యాధికారులు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News