Tuesday, July 2, 2024
HomeతెలంగాణGodavarikhani: యాంటీ డ్రగ్స్ అవేర్ నెస్ ప్రోగ్రాం

Godavarikhani: యాంటీ డ్రగ్స్ అవేర్ నెస్ ప్రోగ్రాం

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్ నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం నుంచి గోదావరిఖని పట్టణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ వినియోగం, రవాణా చట్టపరంగా నిషేధమని అన్నారు. డ్రగ్స్ నివారణ కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు.

కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ ర్యాలీలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపి రమేష్, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ట్రాఫిక్ సీఐ రాజేంద్రప్రసాద్, గోదావరిఖని వన్ టౌన్ సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, లయన్స్ క్లబ్ నిర్వాహకులు డాక్టర్ లక్ష్మీ వాణి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News