క్రమశిక్షణ సత్ప్రవర్తన గల జీవితంతోనే సమాజంలో ఉన్నతమైన స్థానం గుర్తింపు వస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన సత్ర భవనం భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, భూమి పూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్షపరులకు అన్నదాన సత్ర భవనం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయ్యప్ప దీక్షాపరులకు ఆలయంలో బిక్ష చేసే సమయంలో సరైనా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో రూ. 30 లక్షల డిఎంఎఫ్ టి నిధులతో ఈ సత్రంను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మాల దీక్షాపరులు సమాజ సంక్షేమానికి కృషి చేస్తారే తప్ప, చెడు పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయరని అన్నారు. దీక్ష తీసుకున్న తర్వాత ఎటువంటి తప్పులకు తావివ్వకుండా సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగుతారని అన్నారు. భక్తి భావంతో పాటు సమాజ సేవ దృక్పథం పెంపొందుతుందని అన్నారు. దేవుడిని నమ్మినవారు ఉన్నతమైన స్థానాల్లో జీవిస్తున్నారని అన్నారు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని ఉద్దేశంతోనే 365 రోజులపాటు అన్నదాన కార్యక్రమం రూపకల్పన చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఆలయంలో ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారం కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, అడ్డాల స్వరూప రామస్వామి, బాల రాజ్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, అయ్యప్ప కమిటీ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి, నాయకులు నారాయణదాసు మారుతి, జేవి రాజు, నూతి తిరుపతి, ముక్కేర రాజేశం, చల్ల రవీందర్ రెడ్డి, దొమ్మేటి వాసు, చిప్ప రాజేష్, మాటేటి కుమార్, రెడ్డి భాస్కర్, రామ్మోహన్ రావు, సురేష్, చినమూల విజయ్ తదితరులు పాల్గొన్నారు.