కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పంట రుణం మాఫీ చేయ్యాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు రామగుండం బిజేపి ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ. 13 కొర్రీలు పెట్టి రైతు రుణ మాఫీ అంటే ఎలాగని, దాదాపు 50 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 20 లక్షల మందికి కూడా రుణ మాఫీ దక్కేలా లేదన్నారు.
తక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ నిరసన కార్యక్రమాలు కాస్త ఉద్యమ కార్యాచరణగా రూపుదిద్దుకుంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుల సంధ్య రాణి, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, బోడకుంట సుభాష్, కోమల మహేష్, కొండపర్తి సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, కోడూరి రమేష్, గోపగాని నవీన్ గౌడ్, అందే రాజ కుమార్ , బుంగ మహేష్, మామిడి వీరేశం, గుర్రం సురేష్, కన్నూరు భాస్కర్, కుర్ర రాజేందర్, ఈదునూరు చిరంజీవి, పల్లికొండ నర్సింగ్, తడగొండ నర్సయ్య, సిలివేరు అంజి, మాడ ప్రభాకర్ రెడ్డి, బోడకుంట మల్లేష్, బొడ్డు రాజమల్లు, లగిషెట్టి తిరుపతి, కందుల కిషన్, కొల్లూరి లచ్చన్న, రాజేష్ నాయక్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.