Sunday, June 30, 2024
HomeతెలంగాణGodavarikhani: దావెనపల్లి రాజేశంకి చాకలి ఐలమ్మ నేషనల్ అవార్డ్

Godavarikhani: దావెనపల్లి రాజేశంకి చాకలి ఐలమ్మ నేషనల్ అవార్డ్

చాకలి ఐలమ్మ నేషనల్ అవార్డు 2024 సంవత్సరానికిగాను గోదావరిఖని చెందిన దావెనపల్లి రాజేశం అందుకున్నారు. జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన బహుజన రైటర్స్ 4వ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమి (BSA) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ జాతీయప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రమనియన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

- Advertisement -

ఈ సంద ర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ..ఎస్.సి., ఎస్.టి., బి.సి.మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, కవులకు, రచయితలకు స్వచ్చంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు.

వెస్టర్న్ ఇండియాలోని 5 రాష్ట్రాలైనా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ , గోవా రాష్ట్రాల నుండి సుమారుగా 500మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి హాజరైనారని తెలియజేశారు. ఈ అవార్డు కార్యక్రమంలో కాన్ఫరెన్స్ కన్వీనర్ బాలాజీ రామచంద్ర చందన్వార్, జాతీయ కమిటి సభ్యులు యం.యం. గౌతమ్, బాదె వెంకటేశం,తాటికంటి అయిలయ్య, వంగ కుమారస్వామి, తాళ్ళపెల్లి సురేందర్ గౌడ్, వై. రవీంద్రప్రసాద్, ముక్కెర సంపత్ కుమార్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు పానుగంటి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News