సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పే ఆర్డర్(పిపిఓ) సవరణ సీఎంపిఫ్ రీజినల్ కమిషనర్ రామగుండం, అసిస్టెంట్ కమిషనర్ సీఎంపిఫ్ కొత్తగూడెం లేఖలపై జి.యం(పర్సనల్) వెల్ఫేర్&ఆర్.సి కార్పొరేట్ స్వీయ పెన్షనర్లకు సవరించిన పెన్షన్ పే ఆర్డర్(పిపిఓ) జారీ చేసేందుకు సర్క్యూలర్ జారీ చేసిందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సింగరేణి పెన్షన్ దారులు తాము చివరగా పనిచేసిన గని, డిపార్ట్మెంట్ వద్ద అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపారు.
పెన్షన్ దారుడు, పెన్షన్ దారుని భార్య ఆధార్ కార్డ్, పెన్షన్ తీసుకునే బ్యాంక్ పాస్ బుక్, గని అధికారి దృవీకరించిన భార్య, భర్త కలసి పాస్ పోర్ట్ సైజ్ జాయింట్ గా దిగిన మూడు ఫోటోలు, సీపీఆర్ఎస్ మెడికల్ కార్డ్ ప్రతులతో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు చివరగా పని చేసిన గనిలో అధికారులకు పత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు.