తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా ప్రజలందరూ సంతోషంగా కుటుంబ సమేతంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ దసరా పండుగను నియోజకవర్గంలోని ప్రజలందరూ ప్రతి ఇంట సంతోషంగా నిర్వహించుకోవాలని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ కోరారు. సకల జనులందరికీ విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ… హిందూ సాంప్రదాయంలో విజయదశమి పర్వదినం రోజున జమ్మిచెట్టును పూజించటం సాంప్రదాయంగా వస్తుందని పూర్వికులు ఆచరిస్తున్న సంప్రదాయాన్ని నేటికీ ఆచరిస్తూ వస్తున్నామని ఇలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దసరా పండుగ రోజున జమ్మి పూజను నిర్వహిస్తారని అనంతరం కుటుంబ సభ్యులు స్నేహితులు ఆత్మీయులకు పంచుతూ తమ ఆనందాలను వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు.
ఈ విజయదశమి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు ఇచ్చిన 500 మొక్కలను పార్టీలకు అతీతంగా నాటాలని కోరారు.బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో, నియోజకవర్గాల్లో మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.