Friday, November 22, 2024
HomeతెలంగాణGodavarikhani: అంత్యక్రియలు ఉచితంగా చేయాలి

Godavarikhani: అంత్యక్రియలు ఉచితంగా చేయాలి

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ డిమాండ్

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరి నది తీరాన హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే చాలా కాస్ట్లీగా మారిందని పేద,మధ్యతరగతి వారెవరైనా మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే ఒక వ్యాపారంలా మారిపోయిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు కొమ్మ చందు యాదవ్ లు అన్నారు. స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువైనాయని దురదృష్టం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువులు అంతక్రియలు నిర్వహించాలంటే 15000 నుంచి 30 వేల రూపాయలు వరకు ఆర్థిక భారం పడుతుందని వాపోయారు.

- Advertisement -

అనంతరం మద్దెల దినేష్, కొమ్మ చందు యాదవ్ లు మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ దాదాపు 2020 సంవత్సరం నుండి 2024 ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించారు.
నగరపాలక సంస్థలో ప్రజా ప్రతినిధులకు అనుకూలంగా ఉండే వారికి కాంట్రాక్టులు ఇచ్చి విచ్చలవిడిగా బిల్లులు తీసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాకు తో రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంతక్రియలను నిలిపివేయడం దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెంది, హిందూ స్మశాన వాటికకు తీసుకోవస్తే వారి వారి సంప్రదాయాల ప్రకారం కట్టెల కోసం అని లేదా బొంద త్రవ్వడం కోసం అని, డప్పులు అని ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారని, దాంతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఎన్నో పోరాటాలు చేసి ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేయాలని, ఉచిత వైకుంఠ రథాలు నగర పాలక సంస్థనే ఏర్పాటు చేయాలని, నాడు మా వంతుగా పోరాటాలు చేసి అధికార యంత్రాంగానికి విన్నవించామన్నారు. దానివల్ల ఇన్ని రోజులు ఉచిత దహన సంస్కారాలు నిర్వహించారన్నారు. కానీ నేడు అంత్యక్రియలు జరపాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, గతంలానే ఉచితంగా లేదా తెల్ల రేషన్ కార్డు ఉంటే దహన సంస్కారాలు ఉచితంగా రామగుండం నగర పాలక సంస్థ నిర్వహించాలన్నారు. అవసరమైతే సింగరేణి యాజమాన్యం కూడా స్పందించి హిందూ స్మశాన వాటికలో తాము కూడా భాగస్వామ్యం అయి అన్ని సౌకర్యాలు కల్పించాలని దినేష్ డిమాండ్ చేశారు.

స్మశానంలో పూర్తిగా సౌకర్యాలు కరువై, రాత్రి దహన సంస్కారాలు నిర్వహిస్తే కనీసం లైట్లు కూడా వెలగని పరిస్థితి దాపురించందని, రోడ్లు మొత్తం చెడిపోయినాయని చివరికి కాంపౌండ్ వాల్ కూడా లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇక స్మశానం లోపల కనీసం గ్రీనరీ లేదని, చెత్తాచెదారంతో నిండిపోయిందని అసలే ఎండాకాలం అడవిని తలపించే విధంగా ఎండకు చెట్లు కాలిపోయే పరిస్థితి దాపురించిందని, స్మశానాన్ని కాపాడే వారే లేరని చెట్లకు నీళ్లు పెట్టడం కానీ, గార్డెన్ పెంచడం కానీ ఏదీ లేదని సంబంధించిన అధికారులకు అసలు స్మశానం అక్కడ ఉంది అనే సోయి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ దహన సంస్కారాల యంత్రం రోజురోజుకు శిథిలావస్థకు చేరుతుందని దానిని పట్టించుకున్న నాధుడే లేడని వారు ఆసహనం వ్యక్తం చేశారు.కనీసం త్రాగడానికి మంచి నీరు కూడా లేదని, స్మశానం ఆవరణలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు.

కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకొని ఇప్పటికైనా రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించి స్మశాన వాటికను పర్యవేక్షించి స్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News