Saturday, November 23, 2024
HomeతెలంగాణGodavarikhani: రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు ఉరి, కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం

Godavarikhani: రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు ఉరి, కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర

రైతు సంక్షేమ విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతులకు మూడు గంటలు విద్యుత్తు చాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. స్థానిక రాంమందిర్ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమైక్య పాలనలో రైతుల జీవితాల్లో చీకటి అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయాల్లో విద్యుత్ లేక, సాగునీరులేక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారి, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండుగ అని నారా చంద్రబాబు నాయుడు ఆనాడు రైతులపై కాల్పులు జరిపించారని, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి రైతులపై కక్షగట్టి.. వారి జీవితాలను మళ్ళీ చీకటిమయం చేయడానికి కాంగ్రెస్ తో జట్టు కట్టి రైతు వ్యతిరేక విధానాలకు పూనుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ విధానాలతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా పురోగతి చెందిందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ.. మూడు పంటలను పొందుతున్న రైతన్నల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. ఇది ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు మూడు గంటల విద్యుత్తు సరిపోతుందనడం, కాంగ్రెస్ దుర్మార్గపు విధివిధానాలకు అద్దం పడుతుందన్నారు. తెలంగాణలోని రైతులందరూ చైతన్యవంతం కావాల్సిన సమయం వచ్చిందని, గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. రాబోయే కాలంలో బిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కెసిఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలిచే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, ఉరి వేసారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, బాల రాజ్ కుమార్, ఇంజపురి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజినీ, కల్వచర్ల కృష్ణవేణి, పాముకుంట్ల భాస్కర్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్ గౌడ్, పీఎస్ అమరేందర్, పిల్లి రమేష్, మెతుకు దేవరాజ్, అచ్చ వేణు, చల్ల రవీందర్ రెడ్డి, బొడ్డు రవీందర్, తానిపర్తి గోపాలరావు, అధర్ సండే సమ్మారావు, కాల్వ శ్రీనివాస్, నూతి తిరుపతి, వడ్డేపల్లి శంకర్, గుంపుల ఓదెలు యాదవ్, రాకం వేణు, దాసరి ఎల్లయ్య, కలువల సంజీవ్, మేడి సదానందం, దీటి బాలరాజు, ముద్దసాని సంధ్యారెడ్డి, దాసరి శ్రీనివాస్, జడ్సన్ రాజ్, దొమ్మేటి వాసు, మేకల సమ్మయ్య, కొర్రి ఓదెలు, ములకల గోవర్ధన్, తోకల రమేష్, డాక్టర్ చక్రపాణి, కోడి రామకృష్ణ, బండ రాజు, పిడుగు కుమార్, పర్లపెల్లి బాబురావు, బాలసాని చంద్రమౌళి గౌడ్, నీరటి శ్రీనివాస్, గడ్డం నారాయణ, అక్షర మల్లేష్, కర్రావుల రామరాజు, అడ్లూరి రాములు, కలవేణి రవీందర్, మొహిద్ సన్నీ, చిట్టవేణి వేణు, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, చంద్ర మొగిలి, కళావతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News