Friday, November 22, 2024
HomeతెలంగాణGodavarikhani: ప్రజాపాలన కాదిది ప్రజా వ్యతిరేక పాలన

Godavarikhani: ప్రజాపాలన కాదిది ప్రజా వ్యతిరేక పాలన

భయపెట్టి, బెదిరించి..

కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నేతృత్వంలో నియోజకవర్గంలో పోలీస్ పాలన నడుస్తుందని, ప్రశ్నించిన నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీలోని 4వ డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ఉపాధి కల్పిస్తే నేడు ఇదే కాంగ్రెస్ పార్టీ చిరు వ్యాపారులకు ఉపాధిని లేకుండా చేసిందని విమర్శించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

ఈ మేరకు డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుపై కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్తుంటే… రామగుండం నియోజకవర్గంలో మాత్రం ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని ఆరోపించారు. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఆయన గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News