Saturday, November 23, 2024
HomeతెలంగాణGodavarikhani: కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోండి

Godavarikhani: కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోండి

దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న హైలేవల్ బిడ్జ్ ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమం అభివృద్ధికి ఎవ్వరు సాటిలేరనీ కేసీఆర్‌ పాలన యావత్తు దేశానికే ఆదర్శమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజా అవసరాలను తీరుస్తూ ప్రజలకు జవాబుదారీగా పాలన సాగిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 2 కోట్ల 35 లక్షలతో హైలేల్ బిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్ శంకుస్థాపన చేశారు. ఎల్లంపల్లి గ్రామంలో 10లక్షలతో మూర్మూర్ ఎల్లంపల్లి నూతన రోడ్డు, టిటిఎస్ అంతర్గాంలో 10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనెజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూర్ముర్ ఎల్లంపల్లి గోలివాడ గ్రామాల ప్రజలు బిపిఎల్ కు వెళ్లే దారి అస్తవ్యస్థంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో సీవరేజెస్ నిధులు రూ.13 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. అంతర్గాం మండల పరిధిలోని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు తీస్తుందన్నారు. సిఎం కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమలో దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్న ఘనత సిఎం కేసీఆర్అన్నారు. దశాబ్దాల కాలంగా అంతర్గాం మండల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రాహ్మణపల్లి హైలేవల్ బిడ్డిని సీఎం కేసీఆర్కు పలుమార్లు విన్నపం చేసి 2 కోట్ల 35 లక్షల నిధులు మంజూరు చేయించామన్నారు.గతంలో కాంగ్రెస్, టిడిపి పాలనలో ప్రజలకు జరిగిన నష్టంను బిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం అవుతుందన్నారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలయ్యేలా కృషి చేస్తున్నానని అన్నారు. ప్రజా అవసరాలకు అనువైన విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని కులవృత్తులను ప్రోత్సహిస్తూ వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఆని కీర్తించారు. అంతేకాకుండా గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వేసి, ముదిరాజ్ బెస్త కులస్తులను ఓకే తాటిపైకి తీసుకువచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. అదేవిధంగా స్థానికంగా పీహెచ్సి ను ఏర్పాటు చేశామని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గత ఎన్నికల్లో మీరు నన్ను అన్నలాగా తమ్మునిగా భావించి నన్ను గెలిపించారని, మీ సహకారంతోనే రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్, కోర్టు భవన సదుపాయంతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా గెలిపించుకోవాలని, రామగుండంలో గులాబీ జెండా ఎగిరే విధంగా బిఆర్ఎస్ నాయకులు కార్యచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ, బిజేపి పార్టీ నాయకులు రామగుండం నియోజవర్గంలో అభివృద్ధి జరగాలేదని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయాలేని పనులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నరని ఎన్నో ఎళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బ్రాహ్మణపల్లి హైలేవల్ చెడ్డి శంకుస్థాపనే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సమాదానం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో సకల వర్గాలు సంతోషంగా జీవిస్తున్నయని మన కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని కేసీఆర్ ను హ్యట్రిక్ సిఎంగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గ విజయ, జడ్పీటిసి ఆముల నారయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచ్లు బండారి ప్రవీన్, బాదరచేని స్వామి, గుమ్ముల రవీందర్, మేరుగు పోశం, దేవమ్మ రాములు ధర్మాజీ కృష్ణ ఎంపిటీసీ మస్కం శ్రీనివాస్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్ ఉప సర్పంచ్ కుమార్, నాయకులు తిరుపతి నాయక్ కుర్ర నూకరాజు, కోల సంతోష్ గౌడ్ గీట్ల శంకర్ రెడ్డి, అర్జునపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News