రామగుండం రీజీయన్ ఓపెన్ కాస్ట్-3 ప్రాజెక్టులో ఆర్.వి.ఆర్. కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ మాజీ కార్పొరేటర్ లు చుక్కల శ్రీనివాస్, బాబు మియా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న బీహార్, జార్ఖండ్ కార్మికులను విధుల్లోకి రాకుండా స్థానికులు అడ్డుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన 80 జీవో ప్రకారం స్థానిక యువకులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని వారి డిమాండ్ చేశారు. ఆర్ వి ఆర్ కంపెనీ లో స్థానికులు 10శాతం, బిహార్, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్ కార్మికులు 90 శాతం మంది ఉన్నారని, వారిని వెంటనే తీసేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేనియెడల స్థానిక ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో మాజీ కార్పొరేటర్ చుక్కలు శ్రీనివాస్ యాదవ్, 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాబూమియా, 13డివిజన్ అధ్యక్షుడు కూకట్ల రాంకుమార్, మున్సిపల్ జనరల్ సెక్రెటరీ జన్నారం అశోక్,చిన్నాల మల్లయ్య, పిట్టల సారయ్య, ఉ డేకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.