Tuesday, November 5, 2024
HomeతెలంగాణGodavarikhani: రామగుండం కమిషనరేట్ లో నాలుగో సింహం

Godavarikhani: రామగుండం కమిషనరేట్ లో నాలుగో సింహం

సెల్యూట్ సి పి..

రామగుండం పోలీస్ కమిషనరేట్ అంటేనే రాష్ట్రంలో డిఫరెంట్ క్రైమ్ కల్చర్ కలిగిన ప్రాంతం. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలను కలుపుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏర్పడింది. నేరాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, చత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీస్ జోన్ కావడంతో అంతరాష్ట్ర వివాదాలు, అలజడి ఎక్కువే.

- Advertisement -

ఈ కమిషనరేట్ లో పోలీస్ కొలువంటే కత్తి మీద సాము లాంటిదే. ఎప్పుడు ఏదో ఒక మూలన నిత్యం యుద్ధ వాతావరణం తలపిస్తూనే ఉంటుంది. 80, 90 దశకంలో ఈ ప్రాంతంలో పోలీస్ నౌకరి చేయాలంటే ప్రాణాలను పనంగా పెట్టి పోరాడాల్సిందే. మారుతున్న జీవనశైలి, ప్రత్యేక తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేకపోయినా క్రైమ్ రేటింగ్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సమర్ధుడైన పోలీస్ బాస్ ను నియమించి నేరాల నియంత్రణలో సక్సెస్ సాధించింది. అతను ఎక్కడ పని చేసిన తనదైన మార్క్ విధానంతో ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అతను మరెవరో కాదు సిపి శ్రీనివాస్.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సిపి గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన స్టైల్లో క్రైమ్ కంట్రోల్ చేస్తున్నారు. మంచికి ఫ్రెండ్లీ పోలీసింగ్… కాదంటే డెడ్లీ వార్నింగ్ ఇస్తూ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు సి పి శ్రీనివాస్. గంజాయిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి యువతను మత్తుకు బానిస కాకుండా తల్లిదండ్రులతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు సిపి శ్రీనివాస్ వ్యూహాలను ఫాలో అవుతూ కమిషనరేట్ పరిధిలో దొంగలను, దొంగతనాలను నిలువరించారు. సైబర్ క్రైమ్ నేరాలను పసిగట్టి ప్రజలను అలర్ట్ చేయడంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఖాకీల చాకచక్యం వెనుక సి పి శ్రీనివాస్ విజన్ కనబడుతుంది.

మతపరమైన ఘర్షణలు జరగకుండా ఆయా మత పెద్దలను సమన్వయపరుస్తూ శాంతి నెలకొల్పడంలో సిపి శ్రీనివాస్ కృషికి పారిశ్రామిక ప్రాంతం సెల్యూట్ కొడుతుంది. క్రైమ్ రేట్ తగ్గిస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకువచ్చి కల్లోల ప్రాంతాన్ని కల్చరల్ హబ్ గా మార్చిన ఘనత ఆయనదే. రౌడీయిజంపై కవాతు చేసి రౌడీలలో సత్ప్రవర్తన తీసుకువచ్చి సమాజం గర్వించదగ్గ పౌరులుగా మార్చినా అది ఆయనకే చెల్లుతుంది.

భూకబ్జాలు, బెల్ట్ షాప్ లపై బెండు తీసే హీరోఇజం ఆయన సొంతం. ఇదంతా నాణానికి ఒక వైపు. సమాజ హితం కోసం విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ… నేనున్నానంటూ భరోసానిస్తున్న బాస్ శ్రీనివాస్ అనడంలో సందేహం లేదనేది అక్కడ నిర్వివాదాంశం.

హోంగార్డు నుంచి హయ్యర్ అథారిటీ వరకు విధి నిర్వహణలో సలహాలు, సూచనలు చేస్తూ చాణక్య నీతి ప్రదర్శిస్తారనేది కమిషనరేట్ పోలీసుల నమ్మకం. ప్రజా సంక్షేమం, ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందారు. అసాంఘిక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాలపై సమాజంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో సిపి కృషి ఎనలేనిదంటారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ అంటేనే కలవరపడే వారికి అభయ హస్తము అందించి ప్రశాంత జీవితాన్ని అందించిన నాలుగో సింహం శ్రీనివాస్ కు సొంత డిపార్ట్మెంట్ తోపాటు పలువురు అభినందిస్తున్నారు. సెల్యూట్ సి పి శ్రీనివాస్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News